విద్యార్థులకు లక్నో యూనివర్సిటీ న్యూ ఇయర్ గిఫ్ట్
లక్నో యూనివర్సిటీ విద్యార్థులకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థులకు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కల్పించేందుకు కర్మయోగి పథకాన్ని ప్రారంభించింది. తరగతుల తర్వాత రోజుకు ఒక గంట సేపు పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేందుకు అనుమతిచ్చింది. జాబ్ చేసే విద్యార్థికి గంటకు 150 రూపాయలు చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులు ఏడాదిలో రూ.15వేల వరకు సంపాదించుకునే వీలు కలిపించింది. విద్యార్థులకు పనిచేయడం నేర్పడంతోపాటు వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని వర్సిటీ అధికారులు అంటున్నారు.