కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్లో కరోనా టీకాతో వచ్చిన వాహనాన్ని స్థానిక అధికారులు, ప్రజలు వినూత్నంగా ఆహ్వానించారు. వ్యాక్సిన్లు రవాణా చేసే వాహనానికి ముందు నడుస్తూ డప్పులు కొడుతూ.. పటాకులు కాలుస్తూ స్వాగతం పలికారు.ఆరోగ్య సిబ్బంది చౌరస్తా వరకు వెళ్లి వాహనానికి పూజలు చేసి ఊర్లోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు.