29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

మూగజీవిపై దారుణం.. వీడియో వైరల్

జంతువులు ఉండాల్సిన చోటును మనుషులు ఆక్రమిస్తుంటే వాటికి దిక్కు లేక అప్పుడప్పుడు అలా ఊళ్లలోకి వస్తుంటాయి. అయితే ఇక్కడ కూడా మిమ్మల్ని బ్రతకనివ్వం అన్నట్టుగా వాటిని మానవత్వం లేకుండా చంపేస్తున్నారు మనుషులు. రీసెంట్ గా మనుషులు చేసిన పనికి ఓ ఏనుగు బలైపోయింది.


ఈ మధ్య చిరుతలు, జింకలు, ఏనుగులు అడవులు వదిలి జనావాసంలోకి రావడం ఎక్కువైంది. అలానే వచ్చిన ఓ ఏనుగు మనుషులు చేసిన దారుణమైన పనికి ప్రాణాలు కోల్పోయింది.

తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో అడవుల్లోనుంచి జనావాసంలోకి వచ్చిన ఓ ఏనుగును అక్కడి స్థానికులు అరుపులు, డప్పులతో భయపెట్టి తరిమే ప్రయత్నం చేశారు. అందులో ఒకరు టైరుకు నిప్పు పెట్టి ఏనుగు పైకి విసిరారు. ఆ టైరు ఏనుగు చెవికి చిక్కుకుంది. దాంతో ఆ ఏనుగు చెవికి చిక్కుకున్న టైరును తొండంతో తీసే ప్రయత్నం చేస్తే.. నిప్పు తొండానికి కూడా అంటుకుంది. అలా శరీరం మీద మంటలతో.. బాధను భరించలేక ఆ ఏనుగు అడవిలోకి పరుగులు తీసింది.
ఆ తర్వాత అటవీ సిబ్బంది వెంటనే ఆ ఏనుగును గుర్తించి చికిత్స అందించేందుకు శిబిరానికి తరలిస్తుండగా ఆ ఏనుగు మరణించింది. అటవీ సిబ్బంది ఏనుగు కు నిప్పు అంటించిన వారిలో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మరొక వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏనుగుకు నిప్పుపెట్టడాన్ని సోషల్ మీడియాలో దారుణంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

- Advertisement -

Latest news

Related news