దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజులుగా సామాన్యుడికి షాక్ ఇస్తూనే ఉన్నాయి. 2021 బడ్జెట్లో పెట్రోల్ మీద రూ.2.50, డీజిల్ మీద 4 రూపాయల చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించిన విషయం తెలిసిందే. కానీ పెట్రోల్, డీజీల్ ధరలపై అగ్రి సెస్ ప్రభావం ఉండదని, పెట్రోల్, డీజిల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని.. దానితో వినియోగదారులపై అగ్రి సెస్ అదనపు భారం మోపదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది. కానీ గురువారం పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ 90.10, డీజిల్ ధర రూ.83.81గా ఉంది.
దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.65కు చేరింది. డీజిల్ ధర రూ. 76.83కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.93.20, డీజిల్ ధర రూ.83.67గా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.89.13, డీజిల్ ధర రూ.82.04, కోల్కత్తాలో పెట్రోల్ ధర రూ.88.01,డీజిల్ ధర రూ.80.41, అమరావతిలో పెట్రోల్ ధర రూ.92.78, డీజిల్ ధర రూ.85.99గా నమోదైంది.