దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి రోజురోజుకు పెట్రోల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా మరో 27 పైసలు పెరిగి.. రూ. 89.77కి చేరింది. ఈ ధరతో ఆల్ టైమ్ రికార్డు ధరకు పెట్రోల్ ధరలు చేరుకున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.86.30 కాగా, డీజిల్ ధర 76.48కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.88.82, కోల్ కతాలో 87.69, ముంబైలో 92.86కి చేరింది.