దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలను 30 పైసలు పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.60కి, డీజిల్ ధర రూ.77.73కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.94.12, డీజిల్ రూ.84.63కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.91.09గా ఉండగా, డీజిల్ ధర రూ.84.79కి చేరింది.
బెంగళూరులో – పెట్రోల్ రూ.90.53, డీజిల్ రూ.82.40
చెన్నైలో – పెట్రోల్ రూ.89.96, డీజిల్ రూ.82.90
కోల్‌కతాలో – పెట్రోల్ రూ.88.92, డీజిల్ రూ.81.31
జైపూర్‌లో – పెట్రోల్ రూ.93.98, డీజిల్ రూ. 85.95
నిన్న లీటర్ పెట్రోల్, డిజిల్‌పై 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో ఈ ఏడాది ఇప్పటివరకు లీటర్ పెట్రోల్‌పై రూ.3.89, లీటరు డీజిల్‌పై రూ.3.91 పెరిగింది.