21.7 C
Hyderabad
Friday, January 22, 2021

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతున్నట్టు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. తాజాగా పెరిగిన దాంతో కలిపి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.84.45కాగా.. డీజిల్‌ ధర రూ.74.38 నుంచి రూ.74.63కు చేరింది. ఈ పెంపుతో జైపూర్‌లో పెట్రో, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.85, డీజిల్‌ రూ.83.87గా ఉన్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.91.07కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.34గా ఉన్నది. చెన్నైలో- పెట్రోల్‌ రూ.87.18, డీజిల్‌ రూ.79.95, కోల్‌కతా- పెట్రోల్‌ రూ.85.92, డీజిల్‌ రూ.78.22, హైదరాబాద్‌- పెట్రోల్‌ రూ.87.85, డీజిల్‌ రూ.81.45, బెంగళూరు- పెట్రోల్‌రూ.87.30,  డీజిల్‌ రూ.79.14, జైపూర్‌- పెట్రోల్‌ రూ.91.85, డీజిల్‌ రూ.83.87గా ఉంది.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...