26 C
Hyderabad
Wednesday, January 27, 2021

వాహనదారులకు ఊరట.. రూ.5 తగ్గనున్న పెట్రోల్ ధర?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దేశీ ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరిన నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాహనదారులకు ఊరట కలిగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సమయంలో కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలో 50 శాతం తగ్గింపు ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పెట్రోల్ ధరలు లీటరుకు రూ.5 వరకు తగ్గే అవకాశ ఉంది. కరోనా వైరస్ సమయంలో పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకు పెంచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి అనుగుణంగా రేట్లు తగ్గిస్తే.. అప్పుడు వినియోగదారులకు పూర్తి ప్రయోజనం కలుగుతుంది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు నిలకడగానే కొనసాగాయి. దీంతో హైదరాబాద్ శుక్రవారం పెట్రోల్ ధర రూ.87.59, డీజిల్ ధర రూ.81.17 ఉంది.

- Advertisement -

Latest news

Related news

ఆకస్మికంగా మార్కెట్‌యార్డుకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను  అడిగి...

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...

ఎన్టీఆర్ కు గాలమేసిన కేజీఎఫ్ డైరెక్టర్

దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించిన కేజీఎఫ్ సినిమాతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పీడ్ పెంచాడు. కేజీఎఫ్2 పూర్తి కాగానే.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు....

ఐపీఎల్ 2021 వేలం వేదిక ఫిక్స్

ఐపీఎల్-2021 సీజన్ కు సంబంధించి బీసీసీఐ వేలాన్ని చైన్నైలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలం ఉంటుందని బీసీసీఐ ట్విట్టర్లో ప్రకటించింది. జనవరి 20తో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు...