20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

PIB కేంద్రకార్యాలయంలో కరోనా కలకలం

కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది పిట్టల్లా చనిపోతున్నారు. ఇది ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరోలో కరోనా కలకలం సృష్టించింది. ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ ధాట్ వాలియా కరోనా బారిన పడ్డారు. ఈయనను ఎయిమ్స్ లో చేరిపించారు. ఈయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో ఢిల్లీలో ఉన్న ఈ ఆఫీసును మొత్తం మూసేశారు. PIB కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల నిర్వాహణను అక్కడ కాకుండా..శాస్త్రిభవన్ లో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...