21.5 C
Hyderabad
Wednesday, January 20, 2021

ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి ప్రధాని మోడీ ఆఫీస్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ ఆఫీస్‌ను అమ్మకానికి పెట్టారు. అవును ఆఫీస్‌కు సంబంధించిన వివరాలు, ఫొటోలతో ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌లో కొందరు వ్యక్తులు ఒక ప్రకటనను పోస్ట్‌ చేశారు. ఆఫీస్‌ను రూ.7.5 కోట్లకు అమ్ముతున్నట్లు ప్రకటించారు. ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ లో మోడీ ఆఫీసు అమ్మకం ప్రకటనను గమనించిన పోలీసులు ఆ పోస్టును వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 

ప్రధాని మోదీ వారణాసి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రధానికి పార్లమెంటరీ కార్యాలయం ఉన్నది. దీనిని విల్లాగా పేర్కొన్న ప్రకటనకర్తలు, 6500 చదరపు గజాలున్న ఆ బిల్డింగ్‌లో నాలుగు గదులతోపాటు, నాలుగు బాత్‌రూమ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను లక్ష్మీకాంత్‌ ఓఝా పేరుతో ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనను పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...