32.7 C
Hyderabad
Monday, March 1, 2021

స్టెప్పులతో సిగ్నల్ ఇస్తాడు

పోలీసులనగానే ఎందుకో కాస్త భయపడతాం. కానీ మద్యప్రదేశ్ లోని ఈ పోలీస్ ను చూస్తే మాత్రం నోటివెంట చిరునవ్వు రావడం ఖాయం. ఎందుకంటే..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రంజీత్ సింగ్ అనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కి డ్యాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి పెద్ద డ్యాన్సర్ అవ్వాలనేది తన కోరిక. కానీ అతని ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల డ్యాన్సర్ కాలేకపోయాడు. అందుకే ఆ ఇంట్రెస్ట్ ను ఈ రూపంలో తీర్చుకుంటున్నాడు. రంజిత్ సింగ్ 16 ఏళ్లుగా డ్యాన్స్ స్టెప్పులతోనే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తూనే వాహనదారులకు సిగ్నల్ ఇస్తాడు. సిగ్నల్ దగ్గర వెయిట్ చేసే వాహనదారులంతా అతను వేసే డాన్స్ స్టెప్పులను చూసి సరదాగా నవ్వుకుంటారు. రంజిత్ సింగ్ కొన్ని టీవీ షోల్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఆయన ట్యాలెంట్ కు ఉత్తమ ట్రాఫిక్ కంట్రోల్ పోలీస్ అవార్డు కూడా దక్కింది. ట్రాఫిక్ లో ఎలాంటి గొడవలు జరగకుండా చూస్తారని ఆయనను పైఅధికారులు ప్రశంసిస్తుంటారు.

- Advertisement -

Latest news

Related news