29.3 C
Hyderabad
Monday, March 1, 2021

క్షణం క్షణం ఉత్కంఠ.. ఢీల్లీలో ఏం జరుగుతోంది?

ఢిల్లీ సరిహద్దుల్లో.. పోలీసులకు రైతులకు మధ్య ఢీ అంటే ఢీ అనేలా ఉంది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్‌, హర్యానా సరిహద్దుల్లో భారీగా పోలీసు, పారా మిలిటరీ బలగాలు మోహరించారు. యూపీ సర్కార్ తమ ఘాజీపూర్‌ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని రైతులను ఆదేశించింది. విద్యుత్‌, తాగునీటి సరఫరాను కూడా నిలిపేసింది. ఇదిలా ఉంటే రిపబ్లిక్ డే రోజు జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీలో హింస చోటుచేసుకోవడంతో కేంద్రం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. ఢిల్లీ పోలీసులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో 33 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రైతు సంఘాల నేతలపై యూఏపీఏ, దేశద్రోహం కేసులు పెట్టారు. 44 మంది రైతు నేతలకు లుకౌట్‌ నోటీసులు జారీచేశారు. అయితే వీటన్నింటికి భయపడేది లేదని రైతు నేతలు అంటున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేంకు కేంద్రం ప్రయత్నిస్తుందని, రైతు సంఘాలు ఐక్యంగా ఉన్నాయని సంయుక్త కిసాన్‌ మోర్చా అంటోంది.

దీక్షను విరమించాలని పోలీసులు, కేంద్రం తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నాయి. టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతాలకు పారామిలిటరీ దళాలను కూడా తరలించారు. నిరసనలు ఆపకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తామని పోలీసులు అంటున్నారు. అయితే.. అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధమని, ఉద్యమాన్ని ఆపేది మాత్రం లేదని రైతు నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఢీ అంటే ఢీ అనేలా ఉంది.

- Advertisement -

Latest news

Related news