24.1 C
Hyderabad
Thursday, January 21, 2021

సంక్రాంతి ఎందుకంత స్పెషల్ అంటే..

మన తెలుగు పండుగల్లో సంక్రాంతి చాలా స్పెషల్. ఈ పండుగను ఇష్టపడనివాళ్లుండరు. సంక్రాంతి వచ్చిందంటే.. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లు ఇలా ఎవరిపనుల్లో వాళ్లు బిజిగా ఉంటారు. అసలు సంక్రాంతి ఎందుకింత స్పెషల్ అంటే..


ఇలా పుట్టింది
సంక్రాంతి అంటే ముఖ్యంగా వ్యవసాయ పండుగ. ఇది సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే ధాన్యాలు ఇంటికి చేరతాయి. దానికి కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుము పండుగలు జరుపుకుంటారు. కొన్ని కథల ప్రకారం బలరామ, శ్రీకృష్ణులు ద్వాపరయుగంలో పంట చేతికొచ్చే సమయనానికి ప్రజల్లో ఆనందం నింపడానికి వ్యవసాయ పండుగలు చేశేవారట. ఆ స్ఫూర్తి నుంచే వ్యవసాయ పండుగగా సంక్రాంతి పండుగ వచ్చినట్టు పురాణాల్లోచెప్తారు.


కలర్‌ఫుల్ సెలబ్రేషన్స్
సంక్రాంతి అంటే సెలబ్రేషన్స్. సెలబ్రేషన్స్ అంటే సంక్రాంతి. సంక్రాతి రాగానే పల్లెల్లోని రోడ్లన్నీ కలర్‌ఫుల్‌గా మారిపోతాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, ఇంటికి తోరణాలు ఇలా చూడడానికి ముచ్చటగా అనిపిస్తుందీ పండుగ. అలాగే సంక్రాంతి టైంలో ఉండే మరో స్పెషల్ అట్రాక్షన్.. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు. గంగిరెద్దుతో ఆటలు ఆడిస్తూ.. హరిదాసు పాటలు పాడుతూ ఉంటే ఊళ్లల్లో అదో సందడి.

ఇకపోతే పండక్కి ఆడవాళ్లకు చేతినిండా పనే పని. ఇంటిని అందంగా ముస్తాబు చేయడం, రకరకాల పిండివంటలు చేయడం, పూజల్లో బిజిగా ఉంటారు. ఇక పిల్లలైతే చెప్పేపనే లేదు. భోగి రోజు చలిమంట వేయడం నుంచి పతంగులు ఎగురవేయడం వరకూ బిజీబిజీ. అందులోనూ సంక్రాంతి అంటే పిల్లలకు ఓ పది రోజులకు తగ్గకుండా సెలవలొస్తాయి. ఇకపోతే ఇకపోతే కోడిపందేలు, ఎద్దుల పందేల్లో పెద్దవాళ్లు ఎలాగూ బిజీ.. మొత్తంగా సంక్రాంతి వచ్చిందంటే మరపురాని మెమరీస్‌ను వెంట తీసుకొస్తుంది. అందుకే పిల్లలకు, పెద్దలకు, ఆడవాళ్లకు అందరికీ ఫేవరెట్ పండుగ ఇది.


ఒక్కోచోట ఒక్కోలా..
సంక్రాంతికి మరో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే.. ఇది దేశమంతా జరుపుకునే పండుగే అయినా.. సెలబ్రేషన్స్ ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.


కర్ణాటకలో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ గ్రాండ్‌గానే ఉంటాయి. కర్నాటకలోని ఉడిపి సంక్రాంతి సీజన్‌లో కోలాహలంగా ఉంటుంది. కర్నాటకలోని ఆలయాలన్నింటిలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే కర్ణాటక గ్రామాల్లో సంక్రాంతికి కంబాల పోటిలు నిర్వహిస్తారు.

కేరళలో సంక్రాంతిని మకర విళక్కు అని పిలుస్తారు. ఈ సీజన్‌లో కేరళలోని శబరిమలై చాలా రష్‌గా ఉంటుంది. అక్కడి అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దూరప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తుంటారు.

గుజరాత్లో సంక్రాంతి రోజు ఇంట్లో పిల్లలకు బహుమతులు ఇచ్చే సాంప్రదాయం ఉంది. వాళ్లకు నువ్వులతో చేసిన మిఠాయిలు పంచిపెడతారు. అలాగే గుజరాత్‌లో గాలిపటాల పోటీలు చాలా గ్రాండ్‌గా జరుగుతాయి.

ఒరిస్సాలో కూడా సంక్రాంతిని జరుపుకునే ఆచారం ఉంది. ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి, పూజలు చేస్తారు.

మహారాష్ట్రలో సంక్రాంతి పండగ సందర్భంగా హల్వా చేసి బంధుమిత్రులకు పంచుకుంటారు. నువ్వులు, చెరకు ఒకరికొకరు దానం చేసుకోవడం కూడా ఇక్కడ ఆచారం.

రాజస్థాన్‌లో సంక్రాంతి రోజున బంధువుల‌ను, స్నేహితుల‌ను విందు భోజ‌నానికి ఆహ్వానిస్తారు. జైపూర్, జోధ్‌పూర్‌లో రంగురంగుల పతంగుల సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరుగుతాయి.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...