పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి రెండంకెల సీట్లు సాధించడానికే చెమటోడ్చుతుందని.. ఆ పార్టీకి వంద సీట్లు రావడం కష్టమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోష్యం చెప్పారు. బెంగాల్ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ప్రశాంత్ కిషోర్ ఈ ప్రకటన చేశారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అనుకూల మీడియాలో ఎంత ప్రచారం చేసుకున్నా.. వాస్తవంలో బీజేపీ రెండెంకల సీట్లు సాధించడం కూడా కష్టమేన అన్నారు. తాను అంచనా వేసిన దానికంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ప్రస్తుతం కొనసాగుతున్న రంగం నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ వచ్చే బెంగాల్ శాసనసభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా పని చేస్తున్నారు.