32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

డబ్బులిచ్చి జైలుకెళ్లొచ్చు

టూర్స్‌లో బోలెడు రకాలున్నాయి. విదేశీ టూర్ అని, వైల్డ్‌లైఫ్ టూర్ అని.. ఇంకా కొన్ని దేశాల్లో వాలంటూరిజం అని, వెల్‌నెస్ టూరిజం అని రకరకాలున్నాయి. ఇలాంటిదే మనదేశంలో కూడా ఓ వెరైటీ టూరిజం ఉంది. అదే ప్రిజన్ టూరిజం.


మనలో చాలామందికి జైలు జీవితం ఎలా ఉంటుందో తెలీదు. జైలు ఎలా ఉంటుందో.. అక్కడ జీవితం ఎలా గడుపుతారో మామూలు వాళ్లకి అంతగా తెలీదు. అందుకే జైలు ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియెన్స్ చేసేలా ప్రిజన్ టూరిజాన్ని ఆఫర్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.


చాలా రాష్ట్రాల్లో..
మన తెలంగాణలోని మెదక్ జైలులో కూడా ఈ టూరిజం ఫెసిలిటీ ఉంది. రీసెంట్‌గా మహారాష్ట్ర కూడా స్టార్ట్ చేసింది. పుణె నగరంలోని యరవాడ జైలులో ఈ జైలు టూరిజం ప్రారంభించాలని నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన యరవాడ జైలులో పర్యాటక ప్రాజెక్టును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లు ప్రారంభించనున్నారు.


ఇలా ఉంటుంది
ఎవరైతే జైలు జీవితం ఒకసారి గడపాలని కోరుకుంటారో.. వాళ్లు కొంత డబ్బు చెల్లించి ఆ ఎక్స్ పీరియెన్స్‌ను పొందొచ్చు. డబ్బు చెల్లించి ఒక రోజంతా జైలులో ఉండొచ్చు. జైలులో ఖైదీలు చేసే పనులు చేస్తూ రోజంతా గడపొచ్చు. పోలీసులు ఖైదీలను ట్రీట్ చేసినట్టే టూరిస్టులను కూడా ట్రీట్ చేస్తారు. ఉదయాన్నే నిద్ర లేపడం, ఫుడ్ పెట్టడం, పనులు చేయడం ఇలా.. అన్ని రకాలుగా జైలు జీవితాన్ని అనుభవించొచ్చు.

- Advertisement -

Latest news

Related news