కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన యూపీలోని రాంపూర్‌లోని డిబ్డిబా గ్రామ రైతు నవ్రీత్ సింగ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. అనంతరం అక్కడే జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు నవ్రీత్ సింగ్ ప్రాణ త్యాగం వృథా కాదని అన్నారు. బీజేపీ సర్కార్‌పై ప్రియాంక విరుచుకుపడ్డారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ కూడా ప్రియాంకతో ఉన్నారు.
అంతకుముందు ఢిల్లీనుంచి రాంపూర్ వచ్చే క్రమంలో ప్రియాంక ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని నాలుగు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. 24వ నెంబరు జాతీయ రహదారి హాపూర్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో కాన్వాయ్‌లోని కార్లు స్పల్పంగా దెబ్బతినగా.. ప్రియాంక గాంధీతోపాటు అందరూ క్షేమంగా బయటపడ్డారు.