33.1 C
Hyderabad
Sunday, February 28, 2021

నేడు ప్రపోజ్ డే

వాలెంటైన్ వీక్ లో రెండో రోజు ప్రపోజ్ డే. చాలామంది ప్రేమికులకు ఇది ఎంతో విలువైన రోజు. ప్రేమిస్తున్న వ్యక్తికి మనసులో మాట చెప్పే రోజు. “నిన్ను ప్రేమిస్తాను” అని చెప్పడం కోసం ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూసేవాళ్లు ఈ రోజున చెప్పేయడం బెటర్.
ప్రపోజల్ అనేది ప్రేమలో చాలా ప్రత్యేకం. ప్రతి ప్రేమికుడు, ప్రేమికురాలు తన పార్ట్ నర్ తనకు డిఫరెంట్ గా ప్రపోజ్ చేయాలని కోరుకుంటారు. ఆ ప్రపోజల్ జీవితంలో మర్చిపోలేనిదిగా ఉండాలనుకుంటారు. కానీ ప్రేమను తెలపడం అంత సులభం కాదన్న విషయం అందరికీ తెలుసు. ప్రేమను తెలపడం అంత సులభం కాదు కాబట్టే ప్రపోజల్ అనేది అంత ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రపోజ్ డే రోజు కపుల్స్.. మెసేజ్‌లు, కోట్స్, లెటర్ ద్వారా ప్రేమను వ్యక్తపరచొచ్చు. లేదా మనసులోని మాటను నేరుగా కూడా చెప్పేయొచ్చు. లేదా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయొచ్చు. ఎలా చేసినా.. ప్రపోజల్ మాత్రం డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటే బెటర్.

- Advertisement -

Latest news

Related news