23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

అక్టోబర్ 2 వరకూ ఇంతే..

నిన్న జరిగిన చక్కాజామ్ ప్రశాంతంగా ముగిసింది. రాస్తారోకోలో భాగంగా రైతులు మూడు గంటల పాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ సాగిన ఈ రాస్తారోకోతో పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు దాదాపుగా స్తంభించిపోయాయి.
చక్కాజామ్ లో భాగంగా వేల సంఖ్యలో రైతులు రోడ్లపైనే బైటాయించారు. అయితే అత్యవసర వాహనాలు, స్కూలు బస్సులు, అంబులెన్సులకు దారి విడిచిపెట్టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొదలైన చోట్ల కూడా రాస్తారోకో జరిగింది. మొత్తానికి దేశవ్యాప్తంగా జరిగిన రాస్తారోకో సక్సెస్ అయ్యిందని సంయుక్త కిసాన్‌ మోర్చా పేర్కొంది. ప్రతీ వారంలో ఒకరోజు రాస్తారోకోను ప్రశాంతంగా నిర్వహించాలని అనుకుంటున్నట్టు కిసాన్ మోర్చా చెప్పింది.
చట్టాలను రద్దు చేసే దాకా ఢిల్లీ వదిలి ఇళ్లకు వెళ్లేది లేదని రైతు నేతలు స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అక్టోబరు 2వ తేదీ వరకూ జరుగుతుందని.. అప్పటికీ చట్టాలు రద్దు చేయకపోతే.. భవిష్యత్‌ కార్యాచరణను చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాకేష్ తికాయత్ అన్నారు. చట్టాలు రద్దయ్యేవరకూ ఎంతకాలమైనా ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పారు. తాము చర్చలు సిద్ధమని, కానీ చర్చలకు తగిన వాతావరణం ఉండాలని, ముఖ్యంగా రైతులను ఉగ్రవాదులుగా చూడడాన్ని మానుకోవాలని, వేధింపులు ఆపాలని రైతునేతలు చెప్తున్నారు.

- Advertisement -

Latest news

Related news