29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ గుడ్ న్యూస్ అందిచనుంది. అదేంటంటే..


పబ్జీ చైనీస్ గేమ్ అవ్వడం వల్ల, సర్వర్లు కూడా చైనా బేస్డ్ అవ్వడం వల్ల ఆ గేమ్‌ని ఇండియాలో బ్యాన్ చేశారు. అయితే పబ్జీ ఇండియా పేరుతో గేమ్ మళ్లీ ఇండియాకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో టెన్సెంట్ కంపెనీ అచ్చంగా ఇండియన్ వెర్షన్ తో.. సరికొత్త ఫీచర్లతో రీ లాంచ్ చేయనుంది. ఇండియన్ వెర్షన్ లో ఏయే మార్పులు ఉండే అవకాశం ఉందంటే..


కస్టమైజ్డ్ డిజైన్ : పబ్‌జీ మొబైల్ ఇండియా వెర్షన్ కస్టమైజ్డ్ డిజైన్‌తో ఉండొచ్చు. సాధారణ మ్యాప్స్, క్యారెక్టర్లతో పాటు వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్ ఉంటుంది. అలాగే ఎఫెక్ట్స్ కోసం వాడే రంగులు కూడా మారొచ్చు.


టైం రిస్ట్రిక్షన్స్: కొత్త పబ్జీ మొబైల్ ఇండియా వెర్షన్‌లో కూడా టైం రిస్ట్రిక్షన్స్ ఉండనున్నాయి. యూజర్లు ఎంతసేపు పబ్జీ ఆడుతున్నారు అనేది ట్రాక్ చేసి చిన్నపిల్లలకు ప్లే టైం లిమిట్ ఉంటుంది.

ఇండియా సర్వర్లతో: అప్పటిలా కాకుండా.. ఈ గేమ్ పూర్తిగా ఇండియన్ గేమ్‌గా ఉండబోతోంది. యాప్ యూజర్ల పర్సనల్ డేటా మొత్తం ఇండియన్ పబ్జీ సర్వర్లలోనే స్టోర్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ సర్వర్లలో స్థానికంగా హోస్ట్ అయి ఉంటుంది.

పాత అకౌంట్ కూడా: ఇండియన్ వెర్షన్‌లో సర్వర్లు మైగ్రేట్ అయిన తర్వాత పాత పబ్జీ అకౌంట్లలోని యూజర్ల డేటా కూడా మైగ్రేట్ అవుతుంది. అంటే పాత అకౌంట్‌ను ఇప్పుడు వాడుకునే వీలుంది.

పక్కా ప్లానింగ్‌తో…
టెన్సెంట్ కంపెనీ పబ్జీ మొబైల్ ఇండియా గేమ్ కోసం భారతదేశంలో 10 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది. పబ్జీ మొబైల్ సర్వీసుల్లో అనేక మార్పులు చేసిమరీ రీలాంచ్ చేస్తోంది. అంతేకాదు.. పబ్‌జీ యాప్ సర్వర్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ఎప్పటికప్పుడూ రెగ్యులర్‌గా ఆడిట్స్, వెరిఫికేషన్స్ కూడా జరుగుతాయి.

- Advertisement -

Latest news

Related news