29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

గోడలు కాదు మోడీ.. బ్రిడ్జిలు కట్టు : రాహుల్ గాంధీ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందిస్తామని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. రైతుల ఆందోళన రోజురోజుకు ఉద్ధృతంగా మారుతున్నది. సింఘు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో వేలాదిమంది రైతులు ప్రభుత్వానికి, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 6న రైతులు నిర్వహించ తలపెట్టిన రహదారి దిగ్భందనం కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి మోడీ సర్కార్ కుట్రలు చేస్తోంది.

రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుగా భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు మధ్యలో కాంక్రీట్ పోసి.. పదునైన ఇనుప మేకులు పైకి తేలేలా అమర్చారు. ఆ మార్గంలో ట్రాక్టర్ల ద్వారా, ఇతర పద్ధతుల్లో రైతులు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ఈ ఏర్పాటు చేశారు.
ఢిల్లీ-హర్యాణా సరిహద్దుల్లో ఇలా రోడ్డుకు అడ్డుగా ఇనుప మేకులు అమర్చిన అధికారులు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే మేకులు అమర్చారు. రైతులు ఢిల్లీలోకి రాకుండా పలు మార్గాల్లో ఈ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రైతుల దీక్షా శిబిరాల చుట్టూ ఇనుప ఊచలు, సిమెంటు గోడలు నిర్మించడంపై కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల కోసం నిర్మించాల్సింది గోడలు కాదు.. బ్రిడ్జిలు అని సెటైర్ వేశారు. రెండు వరుసల సిమెంటు బారికేడ్లు, వాటి మధ్య కాంక్రీటుతో ఇనుప ఊచలు ఏర్పాటు చేసిన ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్​ ఆందోళన చేస్తోన్న గాజీపుర్‌ సరిహద్దులను అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల సాయంతో పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news