పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రైతులు, కార్మిక రంగానికి 2021 బడ్జెట్ అండగా నిలిచేలా కేటాయింపులు చేయాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగానికి అధిక కేటాయింపులు ఉండేలా చూడాలని చెప్పారు. తరచూ సరిహద్దు వివాదాలు తలెత్తుతుండటం వల్ల దేశ రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాగా.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు నల్లచొక్కాలతో హాజరయ్యారు. మూడు సాగు చట్టాల పట్ల నిరసన తెలిపేందుకే నల్లచొక్కాలతో హాజరైనట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
