రాజకీయాల్లోకి వచ్చి.. ఎన్నికల్లో పోటీ చేయండి అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతోకాలం నుంచి ఆయనను కోరుతున్నారు. రాజకీయ ప్రవేశం పట్ల సుముఖంగా లేక.. రజినీ స్పందించకపోవడం పట్ల అభిమానులు ఆందోళనలు కూడా చేశారు. చాలాకాలం తర్వాత క్లారిటీ ఇస్తూ.. పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటించి.. ఎన్నికల గుర్తు, విధి విధానాలు అందరికీ చెప్తానని ప్రకటించిన తలైవా అనారోగ్యం కారణంగా ఎన్నికల్లో పోటీ చేయడం వీలుకాదని మరో స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. పార్టీ పెడుతున్నానని చెప్పి.. అనారోగ్యం పేరుతో వెనుకడుగు వేయడంతో తలైవా అభిమానులు హర్టయ్యారు. ఇలా అయితే మీ వెంట ఉండం అంటూ.. తలో దారి చూసుకుంటున్నారు.
రజనీకాంత్ యాక్టీవ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయకపోవడంతో అభిమాన సంఘం మక్కల్ మండ్రమ్ జిల్లా అధ్యక్షులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల అధ్యక్షులు డీఎంకేలో చేరారు. మరికొందరు ఏఐఏడిఎంకేలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రజనీ మక్కల్ మండ్రమ్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ పార్టీ నాయకులుకు, శ్రేణులకు లేఖ రాశారు. ఇతర పార్టీల్లో చేరాలనుకునేవారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో రజినీ అభిమానులు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు.
.