26 C
Hyderabad
Wednesday, January 27, 2021

పార్టీ పేరు మక్కల్ సేవై కర్చీ.. పార్టీ గుర్తు ప్యాసింజర్ ఆటో

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ ఏర్పాటు పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ నెల 31న పార్టీ పేరును వెల్లడిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొత్త పార్టీకి చీఫ్‌ కోఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్‌వైజర్‌గా తమిళ్రూవి మణియనణ్‌ను నియమించారు. కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలపై ఇంకా కసరత్తు చేస్తున్నారు. పార్టీ జెండా రంగు, పేరు వంటి అంశాలపై ముఖ్య నేతలతో చర్చించారు. ఇప్పటికే పార్టీ పేరు ఖరారైనట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు రజినీకాంత్ తన పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ’ అనే పేరు పెట్టనున్నట్టు సమాచారం. అంటే ప్రజాసేవ పార్టీ అని అర్థం. ఈ పేరు దాదాపు ఖరారైనట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం రజనీ పార్టీకి ఎన్నికల గుర్తుగా ఆటోను ఖరారు చేసినట్టు సమాచారం.

రజనీకాంత్‌ నటించిన భాషా సినిమాలో ఆటో డ్రైవర్‌గా‌ కనిపించారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన తన ఎన్నికల గుర్తుగా ఆటోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కర్చీ’ పోటీ చేయనుంది. అంతకుముందు రజినీ ‘బాబా లోగో’ను కోరగా.. దాన్ని కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలను ఈ నెలాఖరున రజనీకాంత్‌ స్వయంగా వెల్లడిస్తారు.

- Advertisement -

Latest news

Related news

వంటిమామిడిలో కోల్డ్ స్టోరేజ్ కడుతాం : సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లోని రైతులతో మాట్లాడిన సీఎం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటి మామిడి కూరగాయల మార్కెట్లో...

మదనపల్లె జంటహత్య కేసు నిందితులకు.. 14రోజుల రిమాండ్

మదనపల్లె జంటహత్యల కేసులో నిందితులైన మృతురాళ్ల తల్లితండ్రులకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను పోలీసులు మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు నిందితులకు...

ఆకస్మికంగా మార్కెట్‌యార్డుకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను  అడిగి...

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...