త్వరలో రాజకీయ పార్టీ ప్రకటించనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైబీపీ సమస్య తీవ్ర కావడంతో ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా వాటిలో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ నెల 22న నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ రజనీకి కరోనా నెగెటివ్ వచ్చింది. ఉన్నట్టుండి బీపీ పెరగడం వల్ల ఆయన అస్వస్థతకు గురయ్యారని.. మెరుగైన వైద్యం అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు.

అన్నాత్తె షూటింగ్ కోసం రజనీ కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇటీవల అన్నాత్తె చిత్ర బృందంలో 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ నిలిపేశు. చిత్ర యూనిట్ అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో నెగెటివ్ అని తేలిన రజనీ స్వీయ నిర్భందంలోకి వెళ్ళారు. డిసెంబర్ 31న రజనీకాంత్ తన పార్టీ గుర్తు, జెండా, అజెండా ప్రకటించనున్న తరుణంలో ఆయన అనారోగ్యానికి గురి కావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది.