ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. రజనీకాంత్ ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రించడానికి కృషిచేస్తున్నామన్నారు. శనివారం నాడు ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
రజనీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని, ఆయనను పరామర్శించేందుకు ఎవరిని అనుమతించట్లేదని వైద్యులు చెప్పారు. రజనీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం ఆస్పత్రికి ఎవరూ రావొద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు.