22.9 C
Hyderabad
Monday, January 18, 2021

రజనీ సంచలన నిర్ణయం.. పార్టీ ప్రకటనపై నిర్ణయం

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో పార్టీ పేరు ప్రక‌టిస్తాన‌ని చెప్పిన సూప‌ర్ స్టార్ త‌న నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ పెట్టాలన్న ఆలోచనను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త‌న అనారోగ్య సమస్య దేవుడి హెచ్చరిక‌గా భావిస్తున్నాన‌ని చెప్పారు. అయితే త‌ప్పకుండా రాజ‌కీయాల్లోకి వ‌స్తానని.. అందుకు ఇంకాస్త సమయం తీసుకోనున్నట్టు తెలిపారు.

కొత్త పార్టీ పెట్టే ఆలోచ‌న‌కు తాత్కాలికత విర‌మ‌ణ‌ ఇస్తున్నట్లు రజనీకాంత్ పేర్కొన్నారు. పార్టీ ఆలోచ‌న‌ను అనారోగ్యం కారణంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా నిత్యం ప్రజాసేవ చేస్తానని తెలిపారు. ‘నా నిర్ణయం అభిమానుల‌ను బాధ పెడితే.. దయచేసి క్షమించాలని’ రజనీ కోరారు.

తిరుగుబాటు సృష్టించ‌లేను

అన్నాత్తే షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వెళ్లిన‌ప్పుడు అనారోగ్యం పాల‌య్యానని ర‌జినీకాంత్ తెలిపారు. క‌రోనా నెగిటివ్ వ‌చ్చి హైబీపీతో బాధ‌ప‌డ్డాను. ర‌క్తపోటులో హెచ్చుత‌గ్గులు కిడ్నీల‌పై ప్రభావం చూపుతాయ‌ని వైద్యులు చెప్పారు. పార్టీ ప్రారంభించినా కేవ‌లం సోష‌ల్ మీడియాలో ప్రచారం చేస్తే గెల‌వ‌లేను. ప్రజ‌లు ఆశించే స్థాయిలో రాజ‌కీయ తిరుగుబాటు సృష్టించ‌లేను. రాజ‌కీయ అనుభ‌వ‌మున్న ఎవరైనా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారు అని ర‌జినీకాంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...