ఇండియా-చైనా సరిహద్దుల్లో సైనిక దళాల తగ్గింపుపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణకు చైనాతో ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. దశలవారీగా రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరిస్తాయన్నారు. అంగుళం భూమిని కూడా చైనాకు వదులుకోమన్నారు. ఇప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, చైనాతో చర్చలు కొనసాగుతూనే ఉంటాయని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనాకు దీటుగా సైనికుల మోహరింపులు చేశామన్నారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో మన ధైర్యవంతులైన జవాన్లు పహరా కొనసాగుతుందన్నారు. రెండు వైపులా వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దుల్లో మళ్లీ శాంతి నెలకొనాలంటే బలగాల ఉపసంహరణ జరగాల్సిందేనని చైనాకు తేల్చి చెప్పినట్లు రాజ్నాథ్ సభకు వివరించారు.