జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ఈసారి రాఫెల్ యుద్ధ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. ఢిల్లీ వీధులపై బుధవారం రాఫెల్ ఫైటర్స్ రిహార్సిల్ చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రతినిధి భరత్ భూషణ్ బాబు ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశాడు. ‘ఆకాశంలో కన్పించే రాఫెల్ జెట్ ఫైటర్స్ విన్యాసాలు… జనవరి 26న మీకు కనువిందు చేస్తాయి.’ అని కామెంట్ పెట్టాడు.
రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రెంచ్ నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటికే కొన్ని రాఫెల్ జెట్ ఫైటర్స్ ఎయిర్ ఫోర్స్ చేతికి అందాయి. నిటారుగా పైకి ఎగిరి రోల్ చేసే ‘వెర్టికల్ చార్లీ ఫార్మెషన్’తో రాఫెల్ రిపబ్లిక్ డే పరేడ్ లో ఆకట్టుకోనుంది.