32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

ఏపీలో పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ స్వల్పంగా మారింది. పంచాయతీ ఎన్నికలు వద్దంటూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది.

మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 7న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి.

- Advertisement -

Latest news

Related news