దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 20346 కరోనా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా 222 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10395278 కి చేరగా.. మరణాల సంఖ్య 150336 కి పెరిగిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కోటి మార్క్ దాటింది. గత 24 గంటల్లో 19587 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10016859 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 228083 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.