నిన్న రిపబ్లిక్ డే రోజు.. ట్రాక్టర్ల్ ర్యాలీతో పోటెత్తిన రైతులు డైరెక్ట్‌గా ఎర్రకోటలోకి దూసుకెళ్లారు. ఎర్రకోటలో ఎగిరే జాతీయజెండాను తీసేసి రెండు వేరే జెండాలు ఎగరేశారు. అయితే ఇప్పుడు ఆ జెండాలపై ఇష్యూ జరుగుతోంది. అవి ఖలిస్థాన్ జెండాలని.. ఇవి ఎగరేసినందుకు పాకిస్థాన్ లోని కొన్ని వర్గాలు సంబరాలు కూడా చేసుకుంటున్నాయి. అసలు విషయమేంటంటే..
నిన్న ఎర్రకోటలో ఖలిస్థాన్ జెండా ఎగిరిందని, భారత రిపబ్లిక్కు ఇదొక చీకటిరోజు అని పాకిస్థాన్‌లోని ఆల్ పాకిస్థాన్ ముస్లిమ్ లీగ్ (ఏపీఎంఎల్) పార్టీ సంబరాలు చేసుకుంది. కానీ అక్కడ జరిగిన సీన్ అది కాదని ప్రూఫ్స్ చెప్తున్నాయి.


నిన్న ర్యాలీలో పాల్గొన్న సిక్కులు జాతీయ జెండాను తీసివేసి సిక్కులు పవిత్రంగా భావించే నిషాన్ సాహిబ్ జెండాను ఎగురవేశారు. కాషాయ రంగులో ఉండే ఆ జెండాపై ఉండే సింబల్లో ఓ ఖాండా, కత్తి, రెండు కృపాణాలు ఉంటాయి. ఈ జెండాను గురుద్వారా ప్లేస్ల్లో ఎక్కువగా చూడొచ్చు. అయితే దీన్ని పట్టుకుని ఇది ఖలిస్థాన్ జెండా అని తప్పుగా ప్రచారం జరిగింది. వాస్తవానికి ఖలిస్థాన్ జెండా కాషాయ రంగులో, త్రికోణాకారంలో ఉండదు. ఆ జెండా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది పైగా దాని మీద ఖలిస్థాన్ అని రాసి ఉంటుంది. కానీ ఫొటోలు, వీడియోల్లో క్లియర్‌గా కనిపిస్తున్నదాని ప్రకారం.. ఇవి ఆ జెండాలు కావు. పసుపు రంగులో కనిపిస్తున్న జెండా రైతు సంఘాలది. దానిపై రెండు ఎద్దులకు కాడి కట్టి రైతు వ్యవసాయం చేస్తున్న దృశ్యం ఉంటుంది. పసుపు రంగులో ఉండడంతో కొందరు దీన్ని ఖలిస్థాన్ జెండాగా పొరబడి, తప్పుగా ప్రచారం జరిగింది.