1947లో మనకు స్వాతంత్య్రం వచ్చింది. మన రాజ్యాంగాన్ని మనం రాసుకుని రెండున్నరేళ్లకు అంటే 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న తేదీనే జనవరి 26. దాన్నే రిపబ్లిక్ డే గా జరుపుకుంటాం.
గెస్ట్ ఎందుకు
రిపబ్లిక్ డే పరేడ్‌కు గెస్ట్ ను పిలవాలన్న రూల్ ఏమీ లేదు. కానీ ఇలాంటి ఒక ముఖ్యమైన ఈవెంట్‌కు అతిథి వస్తే ఆ కళ వేరే ఉంటుంది కదా.. అందుకే అలా పిలుస్తారు. అలాగే మన దేశం ఇచ్చే ఆతిధ్యాన్ని, మన సంస్కృతిని, మిలిటరీని అన్నింటినీ వారికి చూపించినట్టూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి కొన్ని ఇతర వ్యూహాలు కూడా ఉండొచ్చు. అది వేరే విషయం.

గెస్ట్ లేకుండా నాలుగోసారి..
గెస్ట్ లేకుండా పరేడ్ ఇప్పటివరకూ మూడు సార్లే జరిగింది. 1952,1953,1966 ఈ మూడు సంవత్సరాల్లోనే అతిధి లేకుండా పరేడ్ జరిగింది. ఈ మూడు సార్లలో 1952,1953 లో అతిధి లేకపోవడానికి ఎలాంటి కారణం లేదు. అప్పటికి అలా అతిధిని పిలిచి పరేడ్ నిర్వహించే ఐడియా లేదు. ఇక 1966లో ప్రధాని మరణించడం, కొత్త ప్రధాని నియామకం.. ఈ హడావిడిలో గెస్ట్‌ను పిలవడం కుదరలేదు. ఆ తర్వాత ప్రతీ రిపబ్లిక్ డే కు ఎవరో ఒక గెస్ట్‌ను పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సారికూడా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను గెస్ట్‌గా ఇన్వైట్ చేశారు. డిసెంబర్లో ఆయన ఓకే అని కూడా అన్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కారణంగా ఆయన రాలేకపోతున్నానని సారీ లెటర్ పంపారు.
కొన్నిమిస్.. కొన్నిఫస్ట్
72వ రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పెరేడ్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. అదేంటో.. అన్ని ఇప్పుడే ఇలా కలిసొచ్చాయి. తొలి మహిళా పైలట్ ఎయిర్ షో నిర్వహించడం,అండమాన్ నికోబార్‌కు చెందిన ట్రూప్స్ రావడం, కొత్తగా కొన్న రఫేల్ జెట్స్ దర్శనమివ్వడం, చీఫ్ గెస్ట్ లేకపోవడం, మిలటరీ వెటరన్స్ ప్రదర్శన, మోటర్‌సైకిల్ డేర్‌డేవిల్స్ ప్రదర్శన కూడా లేకపోవడం ఇవన్నీ ఈ సారే జరుగుతున్నాయి.

