ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో హిమపాతం కారణంగా పోటెత్తిన ధౌలిగంగ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే 10 మృతదేహాలను రక్షణ బృందాలు వెలికితీశాయి. షిగంగ పవర్ ప్రాజెక్టు సైతం భారీగా దెబ్బతిన్నది. ఈ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 150 కార్మికులు వరదలో చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెండు ఎంఐ-17, ఏఎల్‌హెచ్ ధ్రువ్ చాపర్ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
రైనీ తపోవన్ డ్యామ్ సమీపంలో నిర్మిస్తున్న ఓ టన్నెల్ లో 16 నుంచి 17 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఐటీబీపీ సిబ్బంది రంగంలోకి దిగారు. టన్నెల్ పై భాగం నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు చూసేయండి.