24.1 C
Hyderabad
Thursday, January 21, 2021

రైస్, రోటీ, మిల్లెట్స్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

మనలో చాలామంది బరువు తగ్గడం కోసం చాలారకాలుగా ట్రై చేస్తుంటారు. కొంతమంది వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తీసుకుంటుంటే.. మరికొంత మంది అచ్చంగా రోటీలు తింటుంటారు. ఇంకొంత మంది ఈ రెండు కాకుండా జొన్నలు మిల్లెట్స్ లాంటివి తింటుంటారు. ఇంతకీ బరువు తగ్గడానికి వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్?

Slim young woman measuring her thin waist with a tape measure, close up; Shutterstock ID 301460216


ఆహారం తీసుకునే పరిమాణం అందులో ఉండే క్యాలరీలు, పదార్థాలను బట్టి బరువు తగ్గడం పెరగడం అనేది ఆధారపడి ఉంటుంది. బ్రౌన్ రైస్, రోటీలు, మిల్లెట్స్ లాంటి వాటిలో ఏయే క్యాలరీలు ఉంటాయో ఓసారి చూద్దాం.

వంద గ్రాముల గోధుమ పిండిలో 76గ్రా. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 2.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 10 గ్రా. ఉంటాయి. టోటల్‌గా వంద గ్రాముల గోధుమల్లో 364కిలో క్యాలరీలు ఉంటాయి.

ఇకపోతే వంద గ్రాముల వైట్ రైస్ లో 80గ్రా. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 1.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 7 గ్రా. ఉంటాయి. టోటల్‌గా వంద గ్రాముల గోధుమల్లో 365కిలో క్యాలరీలు ఉంటాయి.

అలాగే వంద గ్రాముల బ్రౌన్ రైస్ లో 77గ్రా. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 8 గ్రా. ఉంటాయి. టోటల్‌గా వంద గ్రాముల గోధుమల్లో 370కిలో క్యాలరీలు ఉంటాయి.

వంద గ్రాముల జొన్న పిండిలో 69గ్రా. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 10 గ్రా. ఉంటాయి. టోటల్‌గా వంద గ్రాముల గోధుమల్లో 316కిలో క్యాలరీలు ఉంటాయి.

దీన్ని బట్టి చూస్తే జొన్నలు, ఇతర మిల్లెట్స్‌లో కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ. అలాగే క్యాలరీలు కూడా తక్కువే. అలాగే వైట్ రైస్‌లో కార్బో హైడ్రేట్స్ ఎక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు రైస్ కు బదులు మిల్లెట్స్ ఎంచుకోవడం బెటర్ అని డాక్టర్లు చెప్తుంటారు.

ఏ ఆహార పదార్థమైనా తగిన పరిమాణంలో తీసుకుంటే బరువు నియంత్రణలోనే ఉంటుంది. అయితే తెల్ల అన్నం, గోధుమ రొట్టెల కంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి మిల్లెట్స్ లో ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువ ఎక్కువ కాబట్టి కొంచెం తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. త్వరగా ఆకలి వేయదు. అందుకే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అలాగే ఒకే ధాన్యాన్ని రోజూ తీసుకోకుండా అన్ని రకాలనూ తీసుకుంటూ ఉండాలి. వాటితో పాటు ఆకుకూరలూ, కూరగాయల్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ, ఫ్యాట్స్ ని తగ్గిస్తే మంచిది. కొద్ది పాటి శారీరక వ్యాయామం, తగినంత నిద్ర మాత్రం కచ్చితంగా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే.. బరువు తగ్గడం ఎంతో ఈజీ అని డాక్టర్లు చెప్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...