29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

బిగ్ బాస్ అభికి.. రోహిత్ శర్మ సర్ ప్రైజ్ గిఫ్ట్

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు విజేత అభిజిత్‌ను టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సర్‌ప్రైజ్ చేశాడు. అభిజిత్‌కు హిట్ మ్యాన్ ఊహించని గిఫ్ట్ పంపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ.. అభిజీత్ ను ఫోన్‌లో పలకరించాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచినందుకు అభినందించాడు. ఈ విషయాన్ని అభిజీతే స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
ఆసీస్ పర్యటనలో ఉన్న తెలుగు క్రికెటర్ హనుమ విహారీ, రోహిత్ శర్మ మధ్య జరిగిన ఓ సంభాషణలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 చర్చకు వచ్చిందంట. విహారి బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ గురించి రోహిత్ కు చెప్పాడట. రోహిత్ కు అభి పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పాడట. దాంతో ఈ బిగ్‌బాస్ విన్నర్‌ను అభినందిస్తూ రోహిత్ శర్మ తన జెర్సీని గిఫ్ట్ గా పంపిచాడట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్… రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడని అభిజిత్ ట్వీట్ చేశాడు.
రోహిత్ శర్మకు వీర ఫ్యాన్ అయిన అభికి.. స్వయంగా రోహితే తన జెర్సీని గిఫ్ట్ గా పంపడంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. తనకు హెల్ప్ చేసిన హనుమవిహారికి ధన్యవాదాలు చెప్పాడు. చిన్నప్పుడు తాను క్రికెటర్ అవ్వాలనుకున్నానని, కానీ కుదర్లేదని.. క్రికెటర్ నుంచి గిఫ్ట్ అందుకోవడంతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటున్నాడు. ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియాకు విజయం వరించాలని, అందరూ మద్దతుగా నిలవాలని అభిజిత్ కోరాడు.

- Advertisement -

Latest news

Related news