32.7 C
Hyderabad
Monday, March 1, 2021

మార్కెట్లోకి కొత్త కలర్ బుల్లెట్ విడుదల

మార్కెట్లోకి కొత్త బండి వచ్చిందంటే చాలు.. యూత్ అంతా దాని గురించి సెర్చ్ మరీ డీటెయిల్స్ తెలుసుకుంటారు. అందులో.. చాలా గ్రాండ్ లుక్ తో రాజసం ఉట్టిపడే రాయల్ ఎన్ ఫీల్డ్ బండికి మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. స్టైలిష్ లుక్ తో కొత్త కొత్త వెర్షన్ బుల్లెట్ బైక్ లను విడుదల చేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ తాజాగా మరో కలర్ ను మార్కెట్లోకి వదిలింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 ఫారెస్ట్ గ్రీన్ కలర్ మోడల్ ను కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టారు. దీని ఎక్స్ షోరూం ధర ఢిల్లీలో రూ.1,33,000గా ప్రకటించారు.
అయితే ఈ కొత్త కలర్ మోడల్ స్టాండర్డ్ వేరియెంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా.. ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియెంట్‌లో రెడ్‌, బ్లూ, బ్లాక్ కలర్ మోడల్స్ ఉన్నాయి. స్టాండర్డ్ వేరియెంట్లలో ఇప్పటికే బ్లాక్‌, ఆనిక్స్ బ్లాక్‌, బుల్లెట్ సిల్వర్ కలర్ మోడల్స్‌ ఇప్పటికే మార్కెట్లో ఫుల్ డిమాండ్ తో అమ్ముడుపోతున్నాయి. కాగా తాజాగా ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఈ జాబితాలో చేరింది. బుల్లెట్ 350 స్టాండర్డ్ వేరియెంట్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఫారెస్ట్ గ్రీన్ కలర్ వేరియంట్ లో కూడా ఉన్నాయి. 346 సీసీ సింగిల్ సిలిండర్‌, ఎయిర్ కూల్ ఇంజిన్‌, 19.1 బేసిక్ హార్స్ పవర్‌, 5 స్పీడ్ గేర్ బాక్స్‌, టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, డబుల్ షాక్ అబ్జార్బర్స్‌, 280ఎంఎం ఫ్రంట్ డిస్క్‌, 153 ఎంఎం రియర్ డ్రమ్‌, సింగిల్ చానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఈ వేరియంట్ లో అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Latest news

Related news