32.7 C
Hyderabad
Monday, March 1, 2021

రైతుల నిరసనలతో రూ.600 కోట్ల నష్టం

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ లతోపాటు ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా జరుగుతున్న రైతుల నిరసన కారణంగా రూ.600 కోట్ల నష్టం జరిగిందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఈ మూడు ఏరియాల్లో ఉన్న 52 టోల్‌ ప్లాజాల్లో టోల్‌ వసూళ్లను రైతుల ఆందోళన ప్రభావితం చేసిందని నివేదికలో చెప్పారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో టోల్ రికవరీ 2020-21లో సుమారు 30-35 శాతం తగ్గినట్టు పేర్కొంది. టోల్ వసూళ్లలో తగ్గుదల కారణంగా రూ.9300 కోట్ల అప్పులు తీసుకున్న ఆయా సంస్థలు సంక్షోభంలో ఉన్నాయని వెల్లడించింది.

- Advertisement -

Latest news

Related news