29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఎంపీలకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు తప్పనిసరి.. స్పీక‌ర్

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 29 నుంచి జరుగనున్న బడ్జెట్ సమావేశాలకు ఎంపీలంద‌రూ క‌చ్చితంగా ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష చేయించుకుని స‌భ‌కు రావాల‌ని స్పీక‌ర్ ఓం బిర్లా చెప్పారు. రాబోయే బ‌డ్జెట్ స‌మావేశాల గురించి ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాజ్య‌స‌భ స‌మావేశాలు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు.. లోక్‌స‌భ స‌మావేశాల‌ను సాయంత్రం 4 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తామన్నారు. 

పార్ల‌మెంట్‌లో ఉన్న క్యాంటీన్‌లో ఎంపీలకు ఇచ్చే ఫుడ్ స‌బ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తున్న‌ట్లు స్పీక‌ర్ చెప్పారు. స‌బ్సిడీ ఎత్తేయడం వ‌ల్ల ఏడాదికి రూ.8 కోట్లు ఆదా అవుతుందన్నారు.

- Advertisement -

Latest news

Related news