21.2 C
Hyderabad
Monday, January 18, 2021

రూ.2 కోట్లకు సర్పంచ్ పదవి వేలం.. మహారాష్ట్రలో ఘటన

ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. అభివృద్ధి బూచీగా పదవులను అమ్ముకోవడం ప్రజాస్వామ్యంలో అలవాటుగా మారింది. పదవులను వేలం వేసి కోట్ల రూపాయలు జమ చేసి.. అభివృద్ధి కోసం అంటూ నయా వ్యాపారానికి తెర తీస్తున్నారు కొంతమంది. గ్రామ సర్పంచ్‌ పదవిని ఓ పెద్దాయన ఏకంగా రూ.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలోని 36 జిల్లాలకు గాను 34 జిల్లాల్లోని 14,234 గ్రామపంచాయతీలకు జనవరి 15 న ఎన్నికలు జరిపేందుకు మహారాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ జారీ చేసింది. గ్రామపంచాయతీలను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే, గ్రామాల్లో కొందరు సర్పంచ్‌ పదవులను బేరానికి పెడుతున్నారు. రూ.25 నుంచి రూ.50 వేల వరకు డెవలప్‌మెంట్‌ ఫండ్‌కు నిధులు ఇచ్చి.. సర్పంచ్ పదవిని దక్కించుకున్న ఘటనలు చాలా జరిగాయి. అయితే.. నాసిక్‌ జిల్లాలో దేవ్లాలీ తాలూకాలోని ఉమ్రానే అనే గ్రామంలో ఓ పెద్దాయన మాత్రం ఏకంగా రూ.2.05 కోట్లు చెల్లించి సర్పంచ్‌ పదవిని ఎగురేసుకుపోయాడు. రూ. కోటితో ప్రారంభమైన సర్పంచ్ పదవి వేలం రెట్టింపు మొత్తంతో ముగిసి విశ్వాస్‌రావు దేవరే అనే వ్యక్తికి దక్కింది. నిజానికి సర్పంచ్ పదవిని ఆక్షన్‌ పెట్టాలన్న ఆలోచన గ్రామపెద్దలకు తొలుత లేదు. అయితే, పోటీ ఎక్కువగా ఉండటంతో గ్రామంలో ఆలయం నిర్మించడంతోపాటు దాని ఆలనాపాలనా చూసేందుకు సర్పంచ్ పదవిని ఆక్షన్‌ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...