తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. దీంతో శశికళను భద్రత నడుమ సెంట్రల్ జైలు నుంచి బెంగళూరులోని బౌరింగ్- లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాంటీ జెన్ టెస్ట్ లో శశికళకు కరోనా నెగిటివ్ గా వచ్చింది. మరింత స్పష్టత కోసం ఆర్టీ పీసీఆర్ టెస్టు రిజల్ట్స్ కోసం వేచిచూస్తున్నారు.
బెంగళూరు సెంట్రల్ జైలులో అక్రమాస్తుల కేసులో నాలుగేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ రూ.10 కోట్ల జరిమానా చెల్లించి ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శశికళ విడుదల కావడం.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.