29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

శశికళ డిశ్చార్జ్.. కారుపై ఆ పార్టీ జెండా!

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్‌ అయింది. శశికళ ప్రయాణించిన కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటం ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. శశికళని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తమిళనాడు సీఎం పళనిస్వామి  చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళ అన్నాడీఎంకే పార్టీ జెండా ఉన్న కారులో ప్రయాణించడం మరో చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరి కొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. శశికళ జైలు శిక్ష పూర్తిచేసుకోని సరిగ్గా ఎన్నికల టైంకు బయటకు రావడం తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన శశికళను అప్పటి పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించారు.

2017లో అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ.. బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలులో నాలుగేళ్ల శిక్ష అనుభవించారు. కరోనా లక్షణాలు కన్పించడంతో విక్టోరియా ఆస్పత్రికి తరలించి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో చికిత్స అందించారు.

- Advertisement -

Latest news

Related news