20.1 C
Hyderabad
Thursday, February 25, 2021

జైలు నుంచి శశికళ విడుదల

తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కరోనా సోకడంతో ఆమె ప్రస్తుతం విక్టోరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో విడుదల ప్రక్రియను జైలు అధికారులు హాస్పిటల్లోనే పూర్తి చేశారు. కరోనా లక్షణాలు లేకపోవడంతో ఆమెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. శశికళకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. శశికళ జైలు నుంచి వచ్చాక పార్టీలో తిరిగి చేర్చుకోబోమని ఇటీవల ఢిల్లీలో తమిళనాడు సీఎం పళనిస్వామి చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news