29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ముంబైలో కరోనా ఉధృతి.. బడులు బంద్

మహారాష్ట్ర రాజధాని ముంబై‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలన్నీ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మూసివేయాలని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఆదేశించింది. దేశ ఆర్ధిక రాజధాని లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మేయర్ కిషోర్ పడ్నేకర్ ప్రకటించారు.
మహారాష్ట్రలో దాదాపు 8 నెలల తర్వాత పాఠశాలలను తెరిచారు. నవంబర్ 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకోగా.. ముంబైలో మాత్రం డిసెంబర్ 31 వరకు సెలవులు ప్రకటించారు. అయితే తాజాగా మళ్లీ ముంబై లో కోవిడ్ కేసులు భారీగా నమోదు కావడంతో మళ్ళీ బడులు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
అయితే ఇప్పటికే పాఠశాల యాజమాన్యం స్కూళ్లకు వచ్చే విద్యార్ధులు కోవిడ్ నిబంధనలు పాటించేలా పాఠశాలల్లో శానిటైజర్లు సిధ్ధం చేశారు. విద్యార్ధులు మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. విధులకు హజరయ్యే ముందు ఉపాధ్యాయులందరూ కొవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారు మాత్రమే విధులకు హజరవ్వాలని విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. విద్యార్దులు కూడా క్లాస్ రూమ్ లో భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖమంత్రి వర్షా గైక్వాడ్ ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపట్టారు.

- Advertisement -

Latest news

Related news