23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను తొలగించిన ఎస్ఈసీ

ఏపీలో పంచాయతీ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇద్దరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తొలగించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించే చర్యల్లో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించినట్టు నిమ్మగడ్డ వివరణ ఇచ్చారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లతోపాటు తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు డిప్యూటీ ఎస్పీ, శ్రీకాళహస్తి డిప్యూటీ ఎస్పీ, మాచెర్ల, పుంగనూర్, రాయదుర్గం, తాడిపత్రి సర్కిల్ ఇన్స్ పెక్టర్లు ఉన్నారు.  పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రెస్ మీట్  ఏర్పాటు చేశారు.

- Advertisement -

Latest news

Related news