ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌పై ఎస్ఈసీ వేటు వేసింది. 30 రోజులపాటు సెలవుపై వెళ్లడమే కాకుండా.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఎన్నికల కమీషన్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయన ప్రవర్తన ఎన్నికలకు విఘాతం కలిగించేలా.. ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధులనుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదని ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది.