ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొరడా ఝలిపించారు. సీనియర్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ వేటు వేసింది. ఆ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 3.60 లక్షల మంది ఓటు హక్కుకు దూరమయ్యారని ఎస్ఈసీ ఉత్వర్వుల్లో పేర్కొంది. అధికారుల తప్పులను సర్వీస్ రికార్డుల్లో రాయాలని ఎస్ఈసీ బదిలీ ఉత్తర్వుల్లో ఆదేశించారు.