ఏపీలో పంచాయతీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరుతూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ఉద్యోగులు ఎన్నికల విధులకు రాలేమని చెప్పిన నేపథ్యంలో కేంద్ర సిబ్బంది అవసరం ఉందని ఎస్ఈసీ నిర్ణయించి ఆ మేరకు కేంద్రానికి లేఖ రాసారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుప్రీం కోర్టు నేడు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగు విడుతల్లో జరిగే ఎన్నికలు తొలి విడత ఫిబ్రవరి 7న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి.