పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం జరిగింది. సీరం టెర్మినల్ గేట్-1 వద్ద ఈ ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న సెజ్ 3 భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. మంటల వ్యాప్తితో నాలుగు, ఐదో అంతస్తుల్లో పొగలు వ్యాపించాయి. పది ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదం వల్ల కొవిషీల్డ్ ఉత్పత్తికి ఎటువంటి ఆటకం లేదని సంస్థ ప్రకటించింది. వ్యాక్సిన్ సెక్షన్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా ఫర్మ్ ఆస్ట్రాజెనీకా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంలో కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.