29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

శంకర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. ఎందుకంటే..

భారీ చిత్రాలను కూడా ఈజీగా హ్యాండిల్ చేసే స్టార్‌ డైరెక్టర్‌ డైరెక్టర్‌ శంకర్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. అదికూడా అప్పుడెప్పుడో రోబో సినిమాకు సంబంధించి రీసెంట్ గా చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది.
2010లో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా శంకర్‌ ‘రోబో’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కథపై అరుల్‌ తమిళ్‌ నందన్‌ అనే రైటర్‌ శంకర్‌పై కేసు వేస్తూ కోర్టుకెక్కాడు. తాను రాసిన జిగుబా అనే కథను కాపీ చేసి శంకర్‌ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని అరుల్‌ తమిళ్‌ నందన్‌ కేసు వేశాడు. అయితే.. ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ డైరెక్టర్‌ శంకర్‌ స్పందించలేదు. దీంతో తాజాగా కోర్టు అతనిపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేస్తూ కేసును ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.

- Advertisement -

Latest news

Related news