29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

శశికళ పార్టీలోనే లేరు.. పళనిస్వామి

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాల్లో అనుహ్య మార్పులు జరగుతున్నాయి. సీఎం పళనిస్వామి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జనవరి 27న జయలలిత మెమోరియల్‌ను సీఎం పళనిస్వామి ప్రారంభించనున్నారు. ఢిల్లీ వచ్చిన సీఎం మీడియాతో మాట్లాడారు. పీఎం నరేంద్రమోడీ, అమిత్ షాలతో సమావేశం కానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంలో శశికళ మళ్లీ అన్నాడీఎంకేలోకి వస్తారన్న వార్తలను ఆయన ముందు ప్రస్తావించగా.. ఆ అవకాశం లేదని కొట్టిపారేశారు. శశికళ పార్టీలోనే లేరని స్పష్టం చేశాడు. ఆమెను మళ్లీ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదన్నారు. ఈ విషయంలో అన్నాడీఎంకేలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల నుంచి జైళ్లో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news